Fri Dec 05 2025 17:49:32 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : గుంటూరు మేయర్ అభ్యర్థి కూటమి కైవసం
గుంటూరు మేయర్ అభ్యర్థి పదవిని కూటమి కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు.

గుంటూరు మేయర్ అభ్యర్థి పదవిని కూటమి కైవసం చేసుకుంది. కూటమి అభ్యర్థిగా కోవెలమూడి రవీంద్ర ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి కొందరు క్రాస్ ఓటింగ్ చేయడంతో ఈ ఎన్నికలో కూటమి అభ్యర్థి కోవెలమూడి రవీంద్ర మేయర్ గా ఎన్నికయినట్లు అధికారుల ప్రకటించారు. కూటమి అభ్యర్థి కోవెల మూడి రవీంద్రకు 34 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థికి 27 ఓట్లు మాత్రమే వచ్చాయి.
కోవెలమూడి రవీంద్ర మేయర్ గా...
గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కార్పొరేటర్లు అధికంగా గెలిచినప్పటికీ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కార్పొరేటర్లు ఎక్కువ మంది వైసీపీ నుంచి టీడీపీలోకి వెళ్లిపోయారు. దీంతో కోవెల మూడి రవీంద్ర చేత మేయర్ గా గుంటూరు కార్పొరేషన్ అధికారులు ప్రమాణ స్వీకారం చేశారు. వైసీపీ కార్పొరేటర్లు ఎన్నిక తర్వాత సమావేశాన్ని బహిష్కరించి వెళ్లిపోయారు.
Next Story

