Thu Jul 17 2025 00:12:27 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : నేడు బెజవాడ బందరురోడ్డుకు వెళ్లకండి
ఆంధ్రప్రదేశ్ లో నేడు కూటమి ప్రభుత్వం తిరంగ ర్యాలీని నిర్వహించనుంది.

ఆంధ్రప్రదేశ్ లో నేడు కూటమి ప్రభుత్వం తిరంగ ర్యాలీని నిర్వహించనుంది. ఆపరేషన్ సిందూర్ ను విజయవంతం చేసినందుకు సైనికులకు మద్దతుగా ఈ ర్యాలీని నిర్వహించాలని నిర్ణయించారు. సైనికుల మద్దతుగా నేడు జరిగే తిరంగ ర్యాలీలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ లకు సంబంధించిన నేతలు, కార్యకర్తలు పాల్గొననున్నారు.
మూడు పార్టీల నేతలు...
ఈ తిరంగ ర్యాలీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరిలు పాల్గొననున్నారు. సాయంత్రం విజయవాడలో ఈ తిరంగ ర్యాలీని నిర్వహించనున్నారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజిసర్కిల్ వరకూ ఈ తిరంగ ర్యాలీని నిర్వహించనున్నారు. మూడు పార్టీల కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ప్రారంభమయ్యే ఈ ర్యాలీ కారణంగా ట్రాఫిక్ ను బందర్ రోడ్డులో పూర్తిగా నిలిపివేయనున్నారు. వాహనాలను అనుమతించరని పోలీసులు తెలిపారు.
Next Story