Wed Jul 16 2025 23:42:16 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : కూటమి సర్కార్ కీలక నిర్ణయం.. ఇక ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపులో కొత్త విధానం?
కూటమి ప్రభుత్వం విద్యార్థులకు వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఫీజు రీఎంబర్స్ మెంట్ ఫీజు చెల్లింపు లో గుడ్ న్యూస్ చెప్పనుంది

ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరసగా ఒక్కొక్క వర్గానికి తీపి కబురు చెబుతోంది. తాజాగా విద్యార్థులకు కూడా వచ్చే ఆర్థిక సంవత్సరానికి ఫీజు రీఎంబర్స్ మెంట్ ఫీజు చెల్లింపు విషయంలో గుడ్ న్యూస్ చెప్పనుంది. ఈ మేరకు తాజాగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాత బకాయీలను విద్యార్థులకు చెల్లించేందుకు అధికారులతో కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ అందించిన నివేదక మేరకు కూటమి ప్రభుత్వం ఫీజు రీ ఎంబర్స్ మెంట్ విషయంలో చెల్లింపులకు నిర్ణయం తీసుకోనుంది.
మార్పులు చేసి...
గత ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ ఫీజు విషయంలో తీసుకున్న నిర్ణయాలను సమీక్ష చేసి మార్పులు, చేర్పులు చేయనుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా హాజరును మాత్రమే పరిగణనలోకి తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఫేషియల్ రికగ్నేషన్ ద్వారా హాజరును బట్టి ఫీజు రీఎంబర్స్ మెంట్ చెల్లింపు జరగనుందని తెలిసింది. దీనివల్ల పారదర్శకత కాకుండా విద్యార్ధుల హాజరు శాతం ఖచ్చితంగా ఉంటాయని ప్రభుత్వం భావించి ఈ నిర్ణయాలు తీసుకుందని తెలిసింది.
నేరుగా కళాశాలల యాజమాన్యం ఖాతాల్లోకి...
ఇక తల్లుల ఖాతాల్లో కాకుండా పీజు రీఎంబర్స్ మెంట్ కు సంబంధించిన నిధులను నేరుగా కళాశాల యాజమాన్యాలకు చెల్లించే అవకాశాలున్నాయి. కాలేజీ యాజమాన్యం ఖాతాల్లో జమ చేస్తే నిధులు దుర్వినియోగం అయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తుంది. కళాశాలల యాజమాన్యం కూడా ఫీజుల విషయంలో విద్యార్థులను వేధించే అవకాశముండదని కూడా అంచనా వేస్తున్నారు. కమిటీ ఇచ్చిన నివేదిక ను బట్టి మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. మరి కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన వెంటనే ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ నిధులపై స్పష్టమైన ప్రకటన అధికారికంగా ప్రకటన చేయనుంది.
Next Story