Fri Mar 20 2026 03:43:07 GMT+0530 (India Standard Time)
Alla : మరో 30 ఏళ్లు సీఎం జగనే
మరో ముప్ఫయి ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు

మరో ముప్ఫయి ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా జగన్ ఉంటారని ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ 175 స్థానాలకు 175 స్థానాలు గెలుస్తుందని ఆయన అన్నారు. జగన్ ప్రజలకు చేస్తున్న మేలు చూసి మళ్లీ తాను వైసీపీలోకి వచ్చానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. పేదల వారికి జరుగుతున్న మేలును చూసి ప్రతిపక్షాలు చూసి ఓర్వలేకపోతున్నామని ఆయన తెలిపారు.
టిక్కెట్ ఎవరికిచ్చినా...
2019లో తన చేతిలో నారా లోకేష్ ఓటమి పాలయ్యారని, రానున్న ఎన్నికల్లో బీసీ అభ్యర్థి చేతిలో లోకేష్ ఓటమి ఖాయమని అన్నారు. జగన్ మంగళగిరి సీటును ఈసారి బీసీ నేతకు ఇస్తామని చెప్పారని, ఎవరికి ఇచ్చినా వారి గెలుపు కోసం తాను కృషి చేస్తానని ఆళ్ల రామకృష్ణారెడ్డి తెలిపారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన జోస్యం చెప్పారు.
Next Story

