Tue Mar 17 2026 19:17:13 GMT+0530 (India Standard Time)
సండే.. క్యూ మరింత పెరిగిందిగా?
తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది.

తిరుమలలో భక్తుల రద్దీ తగ్గడం లేదు. ఆదివారం కావడంతో భక్తుల తాకిడి ఎక్కువయింది. దీంతో తిరుమల కొండ భక్తులతో కిటకిట లాడుతుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని కంపార్ట్మెంట్లన్నీ నిండిపోయాయి. బయట వరకూ క్యూ లైన్ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని తిరుమల, తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. రూ. 300 ల ప్రత్యేక దర్శనానికి మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది.
హుండీ ఆదాయం...
నిన్న శ్రీవారిని 81,535 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 37,357 మంది భక్తులు తలనీలాలను సమర్పించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.08 కోట్ల రూపాయలు గా వచ్చిందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
Next Story

