Sat Mar 07 2026 23:18:35 GMT+0530 (India Standard Time)
నేడు నరసాపురం బంద్
అఖిలపక్ష నేతలు నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళనకు దిగారు. నేడు బంద్ కు పిలుపునిచ్చారు

కొత్త జిల్లాల ఏర్పాటుపై నరసాపురంలో ఆందోళనకు సిద్ధమయ్యారు. అఖిలపక్ష నేతలు నరసాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ ఆందోళనకు దిగారు. కొత్త జిల్లాల ఏర్పాటులో భీమవరంను కొత్త జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేశారు. అయితే దీనిపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
స్వచ్ఛందంగా....
ఈరోజు నరసాపురం బంద్ కు అఖలపక్షం నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. నరసాపురం ను జిల్లా కేంద్రంగా ప్రకటించాల్సిందేనని ఆందోళనకు దిగారు. వ్యాపారసంస్థలు ఎక్కడికక్కడ స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. తమ నిరసనను తెలియజేస్తున్నారు. ఆందోళన చేస్తున్న అఖిలపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- Tags
- narasapuram
- bundh
Next Story

