Sat Mar 07 2026 23:18:32 GMT+0530 (India Standard Time)
నేడు రాజంపేట బంద్.. వైసీపీ కూడా?
ఈరోజు రాజంపేట బంద్ ను నిర్వహించాలని అఖిలపక్ష నేతలు సిద్దమయ్యారు. ఈరోజు రాజంపేట బంద్ కు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఇంకా అసంతృప్తి రగులుతూనే ఉంది. హిందూపురంను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని అక్కడి ప్రజలు ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నరసాపురం జిల్లా కేంద్రంగా ప్రకటించాలని బంద్ కూడా నిర్వహించారు. తాజాగా ఈరోజు రాజంపేట బంద్ ను నిర్వహించాలని అఖిలపక్ష నేతలు సిద్దమయ్యారు. ఈరోజు రాజంపేట బంద్ కు పిలుపునిచ్చారు. రాజంపేటను జిల్లా కేంద్రంగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
అన్నమయ్య జిల్లాగా....
ఇటీవల ఏపీలో కొత్త జిల్లాలను ప్రకటిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. అన్యమయ్య జిల్లాగా రాయచోటి కేంద్రంగా ఏర్పాటు చేశారు. దీనిని రాజంపేట వాసులు వ్యతిరేకిస్తున్నారు. వైసీపీ నేతలు కూడా రాజంపేటను జల్లా కేంద్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బంద్ సందర్భంగా ఎటువంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Next Story

