Wed Mar 25 2026 04:12:49 GMT+0530 (India Standard Time)
రేపటి నుంచే అన్ని రకాల దర్శనాలు
రేపటి నుంచి తిరుమలలో అన్ని రకాల దర్శనాలు అందుబాటులోకి రానున్నాయి

రేపటి నుంచి తిరుమలలో అన్ని రకాల దర్శనాలు అందుబాటులోకి రానున్నాయి. శ్రీవారి భక్తులకు నిజంగా ఇది శుభవార్తే. అన్ని రకాల దర్శనాలతో పాటు ఆర్జిత సేవలను పునరుద్ధరిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. గత రెండేళ్లుగా కరోనా తీవ్రతతో అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేశారు. భక్తులను పరిమిత సంఖ్యలోనే అనుమతించడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
పరిమిత సంఖ్యలో....
తిరుమలకు నిత్యం ఏపీ నుంచే కాకుండా దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. అయితే పరిమిత సంఖ్యలో గత రెండేళ్లుగా భక్తులను అనుమతిస్తుండటంతో ఇతర రాష్ట్రాల భక్తులు స్వామి వారిని దర్శించుకోలేకపోయారు. అయితే రేపటి నుంచి అన్ని రకాల దర్శనాలకు అనుమతి ఇవ్వడంతో తిరుమల ఇక భక్తులతో నిండిపోనుంది.
Next Story

