Thu Dec 18 2025 07:26:18 GMT+0000 (Coordinated Universal Time)
రేపు జనసేన ఆవిర్భావ సభ...ఏర్పాట్లు పూర్తి
జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు జనసేన ఏడో ఆవిర్భావ సభ జరగనుంది.

జనసేన ఆవిర్భావ దినోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. రేపు జనసేన ఏడో ఆవిర్భావ సభ జరగనుంది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏర్పాట్లను దగ్గరుండి చూసుకుంటున్నారు. వీఐపీల పార్కింగ్ సదుపాయం నుంచి కార్యకర్తల భద్రత వరకూ అన్ని చర్యలు తీసుకున్నారు. కార్యకర్తలు పైకి ఎక్కేందుకు వీలులేకుండా చూట్టూ ఫెన్సింగ్ లను ఏర్పాటు చేశారు. అలాగే విద్యుత్తు సరఫరా విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యుత్తు షాక్ వంటివి చోటు చేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.
అందరికీ.....
ఇక జనసేన ఆవిర్భావ సభకు ఏపీలోని నలుమూలల నుంచి కాకుండా, తెలంగాణ నుంచి కూడా రానుండటంతో వారందరికి భోజనవసతి ఏర్పాట్లను ప్రత్యేకంగా చేశారు. జనసేన ఆవిర్భావ సభ గుంటూరు జిల్లా మంగళగిరి మండలం ఇప్పటం గ్రామంలో జరగనుంది. మొత్తం 18 ఎకరాల్లో వాహనాలకు పార్కింగ్ ను సిద్దం చేశారు. సోమవారం జరగనున్న ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మొత్తం 12 కమిటీలను ఏర్పాటు చేశారు.
Next Story

