Tue Jan 20 2026 22:57:50 GMT+0000 (Coordinated Universal Time)
నేడు హిందూపురం బంద్
ఈరోజు హిందూపురంలో అఖిలపక్షం నేతలు బంద్ కు పిలుపునిచ్చారు.

ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. అనేకచోట్ల బంద్ లకు పిలుపునిస్తున్నారు. ఈరోజు హిందూపురంలో అఖిలపక్షం నేతలు బంద్ కు పిలుపునిచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటులో పుట్టపర్తిని జిల్లా కేంద్రంగా చేయాలని నిర్ణయించారు. సత్యసాయి జిల్లాగా నామకరణం చేయాలని కూడా ప్రభుత్వం నిశ్చయించింది. సత్యసాయి జిల్లా పేరు విషయంలో ఎటువంటి అభ్యంతరాలు లేకపోయినా జిల్లా కేంద్రం విషయంలోనే అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లా కేంద్రం చేయాలంటూ.....
హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ఇప్పటికే హిందూపురంను జిల్లా కేంద్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. హిందూపురం పారిశ్రామికంగా, వాణిజ్యపరంగా అభివృద్ధి జరిగిందని, దానినే జిల్లా కేంద్రాన్ని చేయాలని కోరారు. దీనిపై హిందూపురంలో నేడు అఖిలపక్షం బంద్ నిర్వహిస్తుంది. ఈ బంద్ కు మద్దతిస్తూ వ్యాపార, వాణిజ్యసముదాయాలను స్వచ్ఛందంగా మూసివేయాలని కోరుతున్నారు.
- Tags
- hindupuram
- bundh
Next Story

