Sun Mar 22 2026 01:40:39 GMT+0530 (India Standard Time)
విశాఖలో 5జీ సేవలు
విశాఖ వాసులకు శుభవార్త అందించింది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్. 5 జీ ప్లస్ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది.

విశాఖ వాసులకు శుభవార్త అందించింది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్టెల్. 5 జీ ప్లస్ సేవలను అందిస్తున్నట్లు పేర్కొంది. విశాఖతో పాటు త్వరలోనే మరికొన్ని నగరాలకు విస్తరిస్తామని ఎయిర్ టెల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సీఈవో శివన్ భార్గవ్ మీడియాకు తెలిపారు.
మరిన్ని నగరాలకు...
5జీ సేవలను ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. అలాగే 4జీ సిమ్ తోనూ 5జీ సేవలను పొందవచ్చని ఆయన తెలిపారు. ప్రస్తుత ఎయిర్టెల్ వినియోగదారులు ఉచితంగానే 5జీ సేవలను పొందవచ్చని ఆయన చెప్పారు. ఇందుకోసం ప్రస్తుతమున్న సిమ్ కార్డును కూడా మార్చాల్సిన అవసరం లేదన్నారు.
Next Story

