Fri Jan 17 2025 08:02:22 GMT+0000 (Coordinated Universal Time)
క్రాప్ హాలిడే వెనక టీడీపీ
కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం వెనక టీడీపీ ప్రమేయం ఉందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు
కోనసీమలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించడం వెనక టీడీపీ ప్రమేయం ఉందని వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు. క్రాప్ హాలిడే అన్నది కేవలం విపక్షాల గోబెల్స్ ప్రచారమేనని చెప్పారు. విపక్ష పార్టీలు రైతు నాయకులను రెచ్చగొట్టి ఈ రకమైన ప్రకటనలు చేయించారని ఆయన విమర్శించారు. క్రాప్ హాలిడే ను ప్రకటించి రైతులను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నంలో భాగమేనని కాకాణి గోవర్థన్ రెడ్డి అన్నారు.
ఆ పరిస్థితులున్నాయా?
జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలను చేపట్టిన తర్వాత రాష్టంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయని, రాష్ట్రంలో ఒక్క కరువు మండలం కూడా లేదని, అలాంటప్పుడు క్రాప్ హాలిడే ఎందుకు ప్రకటించాల్సి వస్తుందని కాకాణి గోవర్థన్ రెడ్డి నిలదీశారు. అలాంటి పరిస్థితులే లేనప్పుడు క్రాప్ హాలిడే ప్రకటించారంటే దీని వెనక రాజకీయం కాక మరేంటని ప్రశ్నించారు. చంద్రబాబు హయాంలో రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని, ఈ పాపాన్ని తమ ప్రభుత్వంపై రుద్దేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో రైతుల పేరిట దోపిడీ జరిగిందని, వైసీపీ హయాంలో రైతులకు న్యాయం జరిగిందని మంత్రి అన్నారు.
Next Story