Sat Mar 07 2026 12:16:05 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : వాయుసేనలో అగ్నివీర్ నియామక ర్యాలీ.. అర్హతలివే
భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు సేనలో నియామకాల కోసం గుంటూరులో ప్రత్యేక రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు

భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు సేనలో నియామకాల కోసం గుంటూరులో ప్రత్యేక రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహించనున్నారు. వివాహం కానీ భారతీయ యువకులు, యువతులు ఈ ర్యాలీలో పాల్గొనే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ రిక్రూట్మెంట్ ర్యాలీ మార్చి 9 నుంచి 15 వరకు గుంటూరు జిల్లా నాగార్జుననగర్లోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రధాన గేటు వద్ద నిర్వహించనున్నారు.
అగ్నిపథ్ పథకం కింద...
అగ్నిపథ్ పథకం కింద భారత వాయుసేనలో చేరాలని ఆశించే అర్హులైన అభ్యర్థులు నిర్ణయించిన తేదీల్లో ర్యాలీకి హాజరుకావచ్చని అధికారులు వెల్లడించారు. అభ్యర్థులు అవసరమైన అన్ని పత్రాలు వెంట తీసుకురావాలని, నియామక ప్రక్రియకు సంబంధించి భారత వాయుసేన జారీ చేసిన మార్గదర్శకాలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
Next Story

