Tue Mar 24 2026 14:22:55 GMT+0530 (India Standard Time)
ఒకే వేదికపై నేడు చంద్రబాబు, పవన్
చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కన్పించనున్నారు

చాలా రోజుల తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఒకే వేదికపై కన్పించనున్నారు. ఎన్నికల ప్రచారం అనంతరం ఇద్దరూ ఒకే వేదికను పంచుకుంటున్నారు. ఈరోజు నరసరావుపేటలో జరిగే వనమహోత్సవం కార్యక్రమంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ పాల్గొంటారు. వనం - మనం పేరిట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
నరసరావుపేటలో...
నరసరావుపేట జేఎన్టీయూ ఆవరణలో నిర్వహించే వన మహోత్సవానికి ఇద్దరు పాల్గొంటుండటంతో భారీ ఏర్పాట్లు చేశారు. జేఎన్టీయూ ఆవరణలో మొక్కలు నాటతారు. అనంతరం అటవీ శాక అక్కడ ఏర్పాటు చేసిన సాళ్లను పరిశీలిస్తారు. తర్వాత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లు బహిరం సభలో పాల్గొంటారు. దీంతో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నారు.
Next Story

