Wed Oct 16 2024 04:05:28 GMT+0000 (Coordinated Universal Time)
కాదంబరి జెత్వానీపై వేధింపులు.. ఏ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారంటే?
నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పోలీసులు
నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల వ్యవహారంలో ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తనను అక్రమంగా నిర్బంధించి, తీవ్ర వేధింపులకు గురిచేశారని నటి కాదంబరి జెత్వానీ ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కుక్కల విద్యాసాగర్, మరికొందరు వ్యక్తులపై ఇబ్రహీపట్నం పీఎస్ లో కేసు నమోదైంది. ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు పెట్టి అరెస్ట్ చేసి ఇబ్బందులకు గురిచేశారని ఫిర్యాదులో తెలిపారు. విద్యాసాగర్‌తో తప్పుడు ఫిర్యాదు ఇప్పించి అప్పటికప్పుడు తమను అరెస్ట్ చేశారని ఫిర్యాదులో తెలిపారు. 192, 211, 218, 220, 354, 420, 467, 469, 471, రెడ్ విత్ 120 (బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నటి కాదంబరి జెత్వానీ ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు వెళ్లి వివరాలు అందించారు.
ఈ కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన పోలీసులపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. గత ప్రభుత్వ హయాంలో పనిచేసిన విజయవాడ ఏసీపీ హనుమంతరావు, ఇబ్రహీంపట్నం అప్పటి సీఐ ఎం.సత్యనారాయణరావును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. జత్వానీపై కేసు నమోదైన అనంతరం సాధారణ బదిలీలలో భాగంగా హనుమంతరావు కాకినాడకు డీఎస్పీగా బదిలీ అయ్యారు.
Next Story