Tue Jan 20 2026 04:50:45 GMT+0000 (Coordinated Universal Time)
రాయిదాడి కేసులో సతీష్ కు బెయిల్
ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌కి బెయిల్ లభించింది

ముఖ్యమంత్రి జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడు సతీష్‌కి బెయిల్ లభించింది. షరతులతో కూడిన బెయిల్ ను జిల్లా కోర్టు మంజూరు చేసింది. అయితే జిల్లా కోర్టు బెయిల్ ఇచ్చే సందర్భంలో కొన్ని షరతులు విధించింది. పోలీస్ విచారణకు సతీష్ సహకరించాలని జిల్లాకోర్టు ఇచ్చిన ఆదేశాల్లో న్యాయస్థానం పేర్కొంది.
బస్సు యాత్ర సందర్భంగా...
ఈ ఏడాది ఏప్రిల్ 13న బస్సు యాత్ర సందర్భంగా విజయవాడ సెంట్రల్ నియోజక వర్గంలో పర్యటిస్తున్న సమయంలో జగన్ పై రాయితో దాడి జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా జగన్ తో పాటు మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు కూడా గాయాలయ్యాయి. ఏప్రిల్ 18న సతీష్‌ను పోలీసులు ఈ కేసులో అరెస్ట్ చేశారు.
Next Story

