Mon Apr 06 2026 23:26:31 GMT+0530 (India Standard Time)
Breaking : మదనపల్లి నిందితుడు ఆత్మహత్య
మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు

మదనపల్లిలో చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కురబలకోట మండలం కనసానిపల్లి చెరువులో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. మదనపల్లిలో ఒక చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. ముఖ్యమంత్రి చంద్రబాబు, లోకేశ్ లు కూడా చిన్నారి తల్లిదండ్రులతో మాట్లాడారు.
చెరువులో మృతదేహం...
అయితే అతనిని పట్టుకుని ఎన్ కౌంటర్ చేయాలని కుటుంబ సభ్యులు ఆందోళనకు కూడా దిగారు. ఈ నేపథ్యంలో నిందితుడు చెరువులో దూకి మరణించినట్లు పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. ఆత్మహత్య చేసుకున్నాడని అంటును్నారు. ఘటనాస్థలికి చేరుకున్న ముదివేడు పోలీసులు మృతదేహాన్ని బయటకు తీస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాల్సి ఉంది.
Next Story

