Mon Mar 16 2026 13:33:53 GMT+0530 (India Standard Time)
Weather Report : మరో అల్పపీడనం.. ఈ జిల్లాలలో వర్షాలు నేడు
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు ఏపీలో వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఈరోజు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఈరోజు ఏపీలోని పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ మేరకు అలెర్ట్ జారీ చేసింది.
మోస్తరు వర్షాలు...
అల్పపీడన ప్రభావంతో కోస్తా తీర ప్రాంతమైన శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి, విశాఖ, అనకాపల్లి, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, అనంతపురం, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
Next Story

