Thu Jan 29 2026 00:54:59 GMT+0000 (Coordinated Universal Time)
చింతమనేని శుద్దపూస కాదు
పటాన్ చెరువు ప్రాంతంలో జరిగిన కోడిపందేల్లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారని పోలీసులు చెప్పారు.

పటాన్ చెరువు ప్రాంతంలో జరిగిన కోడిపందేల్లో మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పాల్గొన్నారని పోలీసులు చెప్పారు. కానీ చింతమనేని మాత్రం తనకు ఏాత్రంసమంధం లేదని తెలిపారు. ఇంత రాక్షస రాజకీయం అవసరమా? అని ఆయన ట్వీట్ చేశారు. కోడిపందేల్లో లేని వ్యక్తిని ఉన్నట్లు చూపిస్తున్నారని అన్నారు. నీచమైన ప్రచారంతో కుప్పకూలే మేడలు కట్టి అధికారంలోకి వచ్చారని తీవ్రంగా విమర్శించారు. మీ మేడ కూలిపోయే సమయం ఆసన్నమయిందని చింతమనేని శాపనార్థాలు పెట్టారు.
ఫొటోలు విడుదల చేసిన....
అయితే పోలీసులు మాత్రం కోడిపందేలు జరిగిన ప్రాంతంలో ఫొటోలను పోలీసులు విడుదల చేశారు. అందులో చింతమనేని ప్రభాకర్ స్పష్టంగా కన్పించారు. పోలీసులు రావడం చూసిన చింతమనేని అక్కడి నుంచి పరారయ్యారు. అందులో దొరికిన వాళ్లను విచారించగా చింతమనేని అక్కడ ఉన్నట్లు తేలిందని కూడా పోలీసులు చెబుతున్నారు.
Next Story

