Fri Mar 20 2026 03:03:00 GMT+0530 (India Standard Time)
Breaking : ఏపీలో పడవ బోల్తా : పన్నెండు మంది గల్లంతు
నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అవుకు జలాశయంలో పడవ బోల్తా కొట్టింది. పన్నెండు మంది పర్యాటకులు గల్లంతయ్యారు

నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అవుకు జలాశయంలో పడవ బోల్తా కొట్టింది. పన్నెండు మంది పర్యాటకులు గల్లంతయ్యారు. దీంతో అధికారులు గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. రెండు మృతదేహాలు ఇప్పటి వరకూ లభ్యమయినట్లు పోలీసులు తెలిపారు.
తంజావూరు వాసులుగా...
గల్లంతయిన పర్యాటకులు తంజావూరు వాసులుగా పోలీసులు భావిస్తున్నారు. గజఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపడుతున్నా కొందరి మృతదేహాలు ఇంకా లభించలేదు. అయితే ప్రమాదానికి గల కారణంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సామర్థ్యానికి మించి పడవలోకి పర్యాటకులను ఎక్కించారా? లేదా మరేదైనా కారణమా? అన్నది తెలియాల్సి ఉంది.
Next Story

