Thu Dec 05 2024 16:49:22 GMT+0000 (Coordinated Universal Time)
తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం.. లోయలోకి పోలీస్ వాహనం
బుధవారం మధ్యాహ్నం జీఎంసీ టోల్ గేట్ దాటే క్రమంలో పోలీసు వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది.
తిరుమల ఘాట్ రోడ్డులో వరుస ప్రమాదాలు జరుగుతున్నాయి. తాజా మొదటి ఘాట్ రోడ్ లో మరోసారి ప్రమాదం జరిగింది. బుధవారం మధ్యాహ్నం జీఎంసీ టోల్ గేట్ దాటే క్రమంలో పోలీసు వాహనం అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో నలుగురు సీఆర్పీఎఫ్ కానిస్టేబుళ్లు గాయపడ్డారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది.. క్షతగాత్రులను తిరుపతి అశ్విని ఆసుపత్రికి తరలించగా.. వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇటీవల తిరుమల ఘాట్ రోడ్లలో వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. నెలరోజుల వ్యవధిలో నాలుగు ప్రమాదాలు జరగడం భక్తులను భయాందోళనకు గురిచేస్తోంది. ఇటీవలే తమిళనాడుకు చెందిన భక్తులతో కొండపై నుంచి దిగువకు వస్తోన్న టెంపో వాహనం అదుపుతప్పడంతో.. పలువురు భక్తులు గాయపడ్డారు. అంతకుముందు మరో వాహనం కూడా ఇలాగే ప్రమాదానికి గురైంది. ఆ సమయంలో వాహనంలో భక్తులు లేకపోవడంతో ప్రమాదం తప్పింది.
Next Story