Sat Dec 13 2025 22:33:11 GMT+0000 (Coordinated Universal Time)
Amdjra Pradesh : ఏసీబీ సోదాల్లో కీలక విషయాలివే
ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్ లో ఏసీబీ అధికారులు సోదాలు జరుగుతున్నాయి. నిన్న మొదలయిన సోదాలు నేడు కూడా జరిగాయి. రాష్ట్రం మొత్తం మీద 120 ప్రాంతాల్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో ప్రయివేటు వ్యక్తుల జోక్యం ఎక్కువగా ఉందని గుర్తించారు. సబ్ రిజిస్ట్రార్లు ప్రయివేటు వ్యక్తులను నియమించుకుని ఆస్తులు కొనుగోలు, అమ్మిన వారి నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గమనించారు. దీంతో కొందరి బయట వ్యక్తుల సెల్ ఫోన్లతో పాటు కార్యాలయంలోని అందరు సిబ్బంది సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం సీజ్...
ఈ సందర్భంగా మధురవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని అవినీతి నిరోధకశాఖ అధికారులు సీజ్ చేశారు. దీంతో నిన్నటి నుంచికార్యకలాపాలు నిలిచిపోయాయి. ఏసీబీ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్న అధికారులు జాయింట్ సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో డిజిటల్ పేమెంట్లపై సకనధాపంగా దృష్టి పెట్టారు. వారిని విచారిస్తున్నారు. ఎవరెవరి నుంచి ఎంత మొత్తం నగదును రోజువారీ తెప్పించుకుంటున్నారన్న దానిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు.
Next Story

