Sat Dec 13 2025 22:32:18 GMT+0000 (Coordinated Universal Time)
ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ పై నేడు విచారణ
ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ పై ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరగనుంది.

ఐపీఎస్ అధికారి సంజయ్ బెయిల్ పిటిషన్ పై ఈరోజు న్యాయస్థానంలో విచారణ జరగనుంది. సంజయ్ ఇప్పటికే ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సంజయ్ బెయిల్ పిటిషన్ పై నేడు ఏసీబీ కోర్టు విచారించనుంది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన ఐపీఎస్ అధికారి సంజయ్ పై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసులు నమోదయ్యాయి.
ఏసీబీ కోర్టు...
ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో సంజయ్ పై ఏసీబీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ప్రస్తుతం విజయవాడ జైలులో జ్యుడీషియల్ రిమాండ్ లో ఉన్నారు. ఇరు పక్షాల వాదనలు నేడు విజయవాడ ఏసీబీ కోర్టు విననుంది. గతంలో పలుమార్లు ఏసీబీ కోర్టు సంజయ్ బెయిల్ పిటీషన్ ను కొట్టివేసింది. మరి నేడు బెయిల్ పిటీషన్ పై న్యాయస్థానం ఏ రకంగా స్పందిస్తున్నది చూడాలి.
Next Story

