Thu Jan 29 2026 06:02:34 GMT+0000 (Coordinated Universal Time)
నేడు చెవిరెడ్డి పిటీషన్ బెయిల్ పిటీషన్ పై విచారణ
మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్లపై నేడు విచారణను ఏసీబీ న్యాయస్థానం చేపట్టనుంది

ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నేడు విచారణ జరగనుంది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్లపై నేడు విచారణను ఏసీబీ న్యాయస్థానం చేపట్టనుంది. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పన్నెండు మందిని అరెస్ట్ చేసిన సిట్ అధికారులు వారిని రిమాండ్ కు తరలించిన నేపథ్యంలో అనేక సార్లు వారి బెయిల్ పిటీషన్లను ఏసీబీ కోర్టు తిరస్కరించింది.
బెయిల్, మధ్యంతర బెయిల్...
అయితే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి బెయిల్, మధ్యంతర బెయిల్ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో నేడు విచారణ జరుగుతుంది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే అక్రమ కేసులు బనాయించారని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన పిటీషన్ లో పేర్కొన్నారు. మరి దీనిపై విచారించి ఎలాంటితీర్పు వెల్లడించనుందో చూడాలి.
Next Story

