Fri Dec 05 2025 13:35:12 GMT+0000 (Coordinated Universal Time)
Breaking : మిధున్ రెడ్డికి షాక్... ఏసీబీ కో్ర్టులో విచారణ?
వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై విచారించిన ఏసీబీ కోర్టు ఈ నెల 12వ తేదీకి విచారణను వాయిదా వేసింది

వైసీపీ పార్లమెంటు సభ్యుడు మిధున్ రెడ్డి పిటీషన్ పై విచారించిన ఏసీబీ కోర్టు ఈ నెల 12వ తేదీకి విచారణను వాయిదా వేసింది. ఇప్పటికే మధ్యంతర బెయిల్ పై ఉన్న మిధున్ రెడ్డి ఈ నెల 11వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలులో సరెండ్ కావాల్సి ఉంది. రెగ్యులర్ బెయిల్ పిటీషన్ పై విచారించిన ఏసీబీ కోర్టు మిధున్ రెడ్డి రెగ్యులర్ బెయిల్ పిటీషన్ ను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేసింది.
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో...
ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న చాణక్య బెయిల్ పిటీషన్ పై కూడా విచారణను ఏసీబీ కోర్టు ఈ నెల 11వ తేదీకి వాయిదా వేసింది. అంతేకాకుండా హైదరాబాద్ లో పదకొండు కోట్ల రూపాయలను సిట్ అధికారులు సీజ్ చేసుకున్న విషయంలపై రాజ్ కేసిరెడ్డి వేసిన పిటీషన్ ను కూడా విచారించింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని కోర్టు సిట్ అధికారులను ఆదేశించింది.
Next Story

