Wed Apr 01 2026 11:13:19 GMT+0530 (India Standard Time)
Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు బంద్
నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి

నేటి నుంచి ఆంధ్రప్రదేశ్ లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నెట్ వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సమ్మెలోకి దిగనున్నాయి. ప్రభుత్వం నుంచి తమకు రావాల్సిన మూడు వేల కోట్ల బకాయిలతో ఆస్పత్రులు నడపలేని పరిస్థితి నెలకొందని అసోసియేషన్ తెలిపింది.
వారం ముందే నోటీసులు...
అసోసియేషన్ వారం రోజుల ముందే ప్రభుత్వానికి సమ్మె నోటీసులు జారీ చేసింది. బకాయిల విడుదలలో ప్రభుత్వం జాప్యానికి నిరసనగా ఎన్టీఆర్ వైద్యసేవలు నెట్వర్క్ ఆస్పత్రులు నిలిపివేశారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. నెట్ వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ తో చర్చించి సమ్మెను విరమింప చేయాలని కోరుతున్నారు.
Next Story

