Thu Mar 19 2026 13:51:32 GMT+0530 (India Standard Time)
నేడు ఢిల్లీకి జగన్
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు గన్నవరం నుంచి బయలుదేరి ఢిల్లీ వెళతారు. ఢిల్లీలో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులను జగన్ కలవనున్నారు. ఈరోజు మధ్యాహ్నం ప్రధాని మోదీని జగన్ కలిసే అవకాశాలున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర రుణ పరిమితిపై సీలింగ్ ఎత్తివేయాలని జగన్ కేంద్ర పెద్దలను కోరనున్నారు.
వివిధ ప్రయోజనాలు....
దీంతో పాటు రాష్ట్రానికి రావాల్సిన వివిధ ప్రయోజనాలు, పోలవరం ప్రాజెక్టు నిధులు వంటివి కూడా వారి వద్ద ప్రస్తావించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వారికి వివరించి మరిన్ని ఆర్థిక ప్రయోజనాలు రాష్ట్రం పొందే విధంగా ముఖ్యమంత్రి జగన్ పర్యటన కొనసాగనుంది. జగన్ తో పాటు పలువురు అధికారులు కూడా ఈ ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. పెండింగ్ లో ఉన్న కొన్ని అంశాలను కూడా ప్రత్యేకంగా రూపొందించిన వినతిపత్రంలో పొందుపర్చినట్లు తెలిసింది.
Next Story

