Fri Mar 20 2026 23:32:05 GMT+0530 (India Standard Time)
నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం
నేడు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది

నేడు తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. ప్రధానంగా తాజా రాజకీయ పరిణామాలపై ఈ సమావేశంలో చర్చ జరగనుంది. ఎన్డీఏలోకి టీడీపీ చేరుతుందన్న ప్రచారం ఇటీవల ఎక్కువగా జరుగుతుంది. దీనిపై నేతలకు చంద్రబాబు క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ కార్యక్రమాలపై కూడా చంద్రబాబు సమీక్షించనున్నారు.
మూడు రాజధానుల బిల్లు...
దీంతో పాటు ఈ నెలలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశముంది. ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లు మళ్లీ ప్రవేశపెడతారంటున్నారు. దీనిపై కూడా చంద్రబాబు సీనియర్ నేతలతో చర్చించనున్నారు. మూడు రాజధానుల బిల్లులు ప్రవేశ పెడితే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలన్న దానిపై ఆయన చర్చిస్తారని తెలిసింది. దీనికి తోడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన పలు కార్యక్రమాల కార్యాచరణను కూడా ఈ సమావేశంలో రూపొందించనున్నారు.
Next Story

