Sat Mar 07 2026 22:46:34 GMT+0530 (India Standard Time)
పవన్ అప్పుల్లో ఉన్నారా...? సోషల్ మీడియాలో వైరల్
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అప్పుల్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.

జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ మధ్య వరసగా అనేక సినిమాలకు సైన్ చేస్తున్నారు. ఒక్కొక్క సినిమాకు ఆయన కోట్లలోనే పారితోషకం తీసుకుంటారన్నది టాలీవుడ్ టాక్. పవన్ డేట్స్ కోసం నిర్మాతలు, డైరెక్టర్లు క్యూ కడతారన్నది కూడా అంతే వాస్తవం. ఆయన సినిమాలకు కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని, అభిమానుల రేంజ్ అలా ఉందని ప్రతి ఒక్కరూ భావిస్తారు. కాకపోతే ఇప్పుడు ఆయన అప్పుల్లో ఉన్నట్లు సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ గా మారింది.
నేత వ్యాఖ్యలతో...
పవన్ కల్యాణ్ కు అత్యంత సన్నిహితంగా ఉండే నేత ఒకరు చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను చూసి పవన్ అభిమానులతో పాటు అనేక మంది ఆశ్చర్యపోతున్నారు. పవన్ కల్యాణ్ ఆదాయపు పన్ను చెల్లించేందుకు ఐదు కోట్ల రూపాయలు అప్పు చేశారని ఆ నాయకుడు చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. పవన్ ఎంతమందికో అనేక రకాలుగా ఆర్థిక సాయం అందించారని, అలాంటి పవన్ కు ఈ అప్పులేంటి? అని మదనపడిపోతున్నారు ఆయన అభిమానులు.
- Tags
- pawan kalyan
- debt
Next Story

