Fri Dec 05 2025 23:46:48 GMT+0000 (Coordinated Universal Time)
YSRCP : ఏపీకి ప్రధాని వస్తున్న వేళ...విజయసాయి రెడ్డి ట్వీట్
ప్రధాని మోదీ ఏపీలో పర్యటిస్తున్న సమయంలో వైసీపీ నేత విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది.

బీజేపీపై విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ వైరల్ గా మారింది. ప్రధాని ఏపీలో పర్యటిస్తున్న సమయంలో విజయసాయి రెడ్డి చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. సోము వీర్రాజు, పురంద్రీశ్వరి, కాపు సామాజికవర్గం అంటూ ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో కాకపుట్టిస్తుంది. ప్రధాని పర్యటన సమయంలోనే విజయసాయి రెడ్డి ఈ ట్వీట్ చేసి ఉంటారని అందరూ భావిస్తుననారు.
బీజేపీ పై....
"ఏమాటకామాట! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజు పార్టీ నిర్మాణానికి ఎంతో శ్రమించారు. పురంధేశ్వరి కావాలని ఆయనను పూర్తిగా పక్కకు పెట్టారు. బహుశా కాపు అయినందువల్లో ఏమో వీర్రాజు గారి మాటకు కనీస విలువ ఇవ్వడం లేదంట. ఆయన హయాంలో రాజమండ్రిలో నిర్మించిన పార్టీ ఆఫీసును వదిలేసి ఆమె సొంత ఆఫీసు ఏర్పాటు చేసుకోవడం, సొంత మనుషుల ద్వారా ప్రచారం నిర్వహించడం మొదటి నుంచి పార్టీలో ఉన్న క్యాడర్ను నమ్మకుండా అవమానించడమేనని అంటున్నారు" అంటూ విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు.
Next Story

