Mon Mar 16 2026 20:49:56 GMT+0530 (India Standard Time)
నేడు మూడు రాజధానులపై సుప్రీంకోర్టులో
మూడు రాజధానులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

మూడు రాజధానులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు తీర్పుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసిన సంగతి తెలిసిందే. శాసన వ్యవస్థలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకుంటుందని, పరిపాలన సౌలభ్యం కోసం మూడు రాజధానులను ఏర్పాటు చేసుకుంటూ తాము ఉభయ సభల్లో తీర్మానం చేసినా హైకోర్టు దానికి వ్యతిరేకంగా తీర్పు నివ్వడంపై అధికార పార్టీ తప్పుపడుతుంది.
అగ్రిమెంట్ ప్రకారం...
అయితే రాజధాని అమరావతి కోసం తమ వద్ద తీసుకున్న భూములకు సంబంధించిన అగ్రిమెంటు ప్రకారం ప్రభుత్వం వెళ్లకుండా మూడు రాజధానుల పేరుతో ముందుకు వెళ్లడాన్ని రైతులు తప్పుపడుతున్నారు. దీనిపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.
Next Story

