Tue Feb 03 2026 11:43:02 GMT+0000 (Coordinated Universal Time)
రాజమండ్రిలో టెన్షన్ టెన్షన్
రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర రాజమండ్రిలో కొనసాగుతుంది

రాజమండ్రిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమరావతి రైతుల మహాపాదయాత్ర రాజమండ్రిలో కొనసాగుతుంది. ఆజాద్ సెంటర్ లో వైసీపీ మూడు రాజధానులకు అనుకూలంగా బహిరంగ సభను ఏర్పాటు చేసింది. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్ నెలకొంది. రాజధాని రైతుల మహా పాదయాత్ర నేడు 37వ రోజుకు చేరుకుంది. నేడు ఎనిమిది కిలోమీటర్ల మేరకే పాదయాత్ర కొనసాగుతుందని నిర్వాహకులు చెబుతున్నారు.
ఆజాద్ చౌక్ సెంటర్ లో...
ఆజాద్ చౌక్ సెంటర్ లో వైసీపీ భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. రైతులకు వ్యతిరేకంగా నినాదలు చేశారు. మూడు రాజధానుల ముద్దంటూ నినాదాలు చేశారు. నల్లబెలూన్లతో నిరసన తెలియజేస్తున్నారు. పోలీసులు ఇరువర్గాలను శాంతింప చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అత్యవసరంగా బహిరంగ సభకు పోలీసులు ఎలా అనుమతిచ్చారని రైతులు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
Next Story

