Tue Mar 17 2026 07:52:28 GMT+0530 (India Standard Time)
అమెరికాలో తెలుగు యువకుడి మృతి
అమెరికాలో ఒక తెలుగు యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రూపక్ రెడ్డి ప్రమాదవశాత్తూ మరణించారు

అమెరికాలో ఒక తెలుగు యువకుడు మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన రూపక్ రెడ్డి ప్రమాదవశాత్తూ మరణించారు. రూపక్ రెడ్డిది శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం పట్టణం. కొద్ది నెలల క్రితం ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాడు. హారిస్ బర్గ్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుతున్నాడు.
స్నేహితులతో కలసి...
అయితే రూపక్ రెడ్డి అతని స్నేహితులతో కలసి సరదాగా జార్జిలేక్ కు వెళ్లారు. అక్కడ బోటుపై వెళుతూ ఒక రాయిపై సెల్ఫీ దిగితూ నీటిలోకి జారిపోయాడు. అయితే పక్కనే ఉన్న స్నేహితులు కాపాడలేకపోయారు. చివరకు సహాయక బృందాలు వచ్చి రూపక్ రెడ్డి మృతదేహాన్ని బయటకు తీశారు. రూపక్ రెడ్డి మృతితో కుటుంబంలో విషాద చాయలు అలుముకున్నాయి.
Next Story

