Fri Aug 12 2022 02:35:52 GMT+0000 (Coordinated Universal Time)
హెలికాప్టర్ ప్రమాదంలో చిత్తూరు జిల్లా వాసి మృతి

ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన వారిలో తెలుగు వ్యక్తి కూడా ఉన్నారు. చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ ఈ ప్రమాదంలో మరణించారు. చిత్తూరు జిల్లా కురబల కోట కు చెందిన సాయితేజ రక్షణ శాఖలో లాన్స్ నాయక్ గా పనిచేస్తున్నారు. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్ గా సాయితేజ పనిచేస్తున్నారు.
2103లో ఆర్మీలో చేరి....
బుధవారం తమిళనాడులో కూలిన ఆర్మీ హెలికాప్టర్ లో బిపిన్ రావత్ తో పాటు సాయితేజ కూడా ఉణ్నారు. 1994లో సాయితేజ చిత్తూరు జిల్లా కురబలకోటలో జన్మించారు. 2013లో ఆర్మీలో చేరిన సాయితేజ అనతి కాలంలోనే సెక్యూరిటీ ఆఫీసర్ గా పదోన్నతిని పొందారు. ఆయనకు భార్య, కుమారుడు , కుమార్తె ఉన్నారు. ఈరోజు ఉదయమే ఆయన తన భార్యతో మాట్లాడినట్లు బంధువులు చెప్పారు. ప్రస్తుతం సాయితేజ కుటుంబం మదనపల్లెలో ఉంటుంది. సాయితేజ మృతితో మదనపల్లెలో విషాద చాయలు అలుముకున్నాయి. ఈ ప్రమాదంంలో 13 మంది మరణించారు.
Next Story