Sat Apr 19 2025 07:42:28 GMT+0000 (Coordinated Universal Time)
నేడు పోలవరానికి కేంద్ర నిపుణుల బృందం
కేంద్ర నిపుణుల బృందం నేడు పోలవరంలో పర్యటించనుంది.

కేంద్ర నిపుణుల బృందం నేడు పోలవరంలో పర్యటించనుంది. డయాఫ్రం వాల్ నిర్మాణ పనుల నాణ్యతను కేంద్ర బృందం పరిశీలించనుంది. గ్యాప్ 1, గ్యాప్ 2 ప్రాంతాల్లో నిర్మిస్తున్న డయాఫ్రం వాల్ నిర్మాణానికి సంబంధించి నాణ్యతను ఈ బృందం పరిశీలించనుంది. అలాగే స్పిల్ వే సమీపంలో ఉన్న మట్టి నమూనాలను సేకరించి కేంద్ర మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు పరిశీలించనున్నారు.
డయాఫ్రంవాల్ ను...
ఈ నిపుణుల బృందంలోకేంద్ర మెటీరియల్ అండ్ సాయిల్ రీసెర్చ్ సెంటర్ నిపుణులు బి. సిద్ధార్థ్ హెడావో, సైంటిస్ట్ విపుల్ కుమార్ గుప్తాలు ఉన్నారు. డయాఫ్రం వాల్ నిర్మాణంలో తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి అక్కడ కాంట్రాక్టర్లకు, అధికారులకు నిపుణుల బృందం సూచించనుంది. ప్రాజెక్టు పనుల్లో కీలకంగా మారిన డయాఫ్రం వాల్ ను పరిశీలించి ప్రభుత్వానికి నివేదికను అందించనున్నారు.
Next Story