Thu Dec 18 2025 10:11:35 GMT+0000 (Coordinated Universal Time)
వర్ల ఇంటికి వెల్లంపల్లి.. అసలేంజరిగిందంటే?
విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన గడప గడపకు ప్రభుత్వం జరిగిన కార్యక్రమంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది

విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో జరిగిన గడప గడపకు ప్రభుత్వం జరిగిన కార్యక్రమంలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్లరామయ్య కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 13,500 రూపాయల రైతు భరోసా కార్యక్రమం ధృవీకరణ పత్రాన్ని మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు అందజేశారు.
డ్రైవర్ ను పంపి...
వర్లరామయ్య భార్య జయయప్రద పేరిట రైతు భరోసా కింద 13,500 రూపాయలు మంజూరయింది. ఈ ధృవీకరణ పత్రాన్ని అందచేసేందుకు గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసులు వర్ల రామయ్య ఇంటికి వెళ్లారు. ఇంట్లోనే ఉన్న వర్ల రామయ్య బయటకు రాకుండా ఆయన తన డ్రైవర్ ను పంపారు. ధృవీకరణ పత్రాన్ని వర్లరామయ్య డ్రైవర్ కు వెల్లంపల్లి అందచేసి వచ్చారు.
Next Story

