Thu Feb 05 2026 06:58:34 GMT+0000 (Coordinated Universal Time)
Andhra Pradesh : రేపు ఏపీలో పల్లెపండగ
ఆంధ్రప్రశ్ లో రేపు పల్లె పండగ కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పల్లె పండగ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఈ పల్లె పండగ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొననున్నారు. రేపు ఉదయం 9 గంటలకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కంకిపాడులోని అయ్యాన్ కల్యాణమండపంలో జరిగే పల్లె పండగ కార్యక్రమంలో పాల్గొంటారని అధికారులు తెలిపారు. మొత్తం అన్ని గ్రామాల్లో ఈ పల్లె పండగ ను నిర్వహిస్తారు. నాలుగువేల కోట్ల రూపాయలతో ముప్పయి వేల రూపాయల పనులను చేపట్టనున్నారు.
కంకిపాడులో...
రేపటి నుంచి పల్లె పండగ కార్యక్రమాన్ని ఏపీ వ్యాప్తంగా నిర్వహించాలని నిర్ణయించారు. అనేక చోట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. గ్రామాల్లో అభివృద్ధి పనులను ప్రారంభోత్సవాలు చేయడం, శంకుస్థాపనలు చేయడం వంటి వాటిని చేస్తారు. పవన్ కల్యాణ్ కూడా కంకిపాడులోని ఒక రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర మంతా పంచాయతీల ఆధ్వర్యంలో నడుస్తుండటంతో అందరూ ఎమ్మెల్యేలు పాల్గొనాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదిశించింది. ఈ మేరకు నిధులు కూడా విడుదల చేసింది.
Next Story
