Tue Mar 10 2026 06:38:53 GMT+0530 (India Standard Time)
నేడు టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం
ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు

ఈరోజు తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. చంద్రబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. చంద్రబాబు అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటారు. ఎమ్మెల్యేలు మాత్రం హాజరు కావాలని చంద్రబాబు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం కీలకమైన బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముండటంతో ఎమ్మెల్యేలు అసెంబ్లీ సమావేశాలకు వెళితే మంచిదన్న అభిప్రాయంతో చంద్రబాబు ఉన్నారు.
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలపై.....
దీనిపై ఈరోజు నిర్ణయం తీసుకునే అవకాశముంది. అలాగే ప్రభుత్వ విధానాలకు వ్యతిరేరకంగా ఆందోళన కార్యక్రమాలను కూడా రూపొందిచే అవకాశముంది. ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల నిర్వహణ పై కూడా సమావేశంలో చర్చించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు అమలు పై ఈ సమావేశంలో చర్చించనున్నారు.
Next Story

