Sat Mar 28 2026 08:11:15 GMT+0530 (India Standard Time)
సంక్రాంతి తర్వాత జనసేన...?
ఈ నెల 9న జనసేన పార్టీ కార్యనిర్వాహకవర్గ సమావేశం జరగనుంది.

ఈ నెల 9న జనసేన పార్టీ కార్యనిర్వాహకవర్గ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయాల్సిన అంశాలపై ఈ సమావేశంలో దృష్టి సారించనున్నారు. మండల పార్టీ అధ్యక్షులతో జగన్ సమావేశం కానున్నారు.
పార్టీ కార్యక్రమాలను....
సంక్రాంతి పండగ తర్వాత నుంచి జనసేన పార్టీ పూర్తిస్థాయిలో ఏపీలో దృష్టి పెట్టాలని నిర్ణయించింది. పవన్ కల్యాణ్ సినిమాల్లో బిజీగా ఉన్నప్పటికీ పార్టీ కార్యక్రమాలను కూడా దానికి అనుగుణంగా తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా సంక్రాంతి తర్వాత జనసేన కార్యక్రమాలను ముమ్మరం చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు.
Next Story

