Wed Mar 18 2026 08:09:55 GMT+0530 (India Standard Time)
బెజవాడలో బీజేపీ కీలక సమావేశం నేడు
భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి కీలక నేతల సమావేశం నేడు జరగనుంది.

భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి కీలక నేతల సమావేశం నేడు జరగనుంది. విజయవాడలో జరగనున్న ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలపై చర్చించనున్నారు. ఉత్తరాంధ్ర బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్ కు డిపాజిట్లు కూడా రాకపోవడంపై ప్రధానంగా చర్చించే అవకాశముంది. ప్రచారాన్ని సక్రమంగా నిర్వహించినా ఎక్కడ లోపం జరిగిందన్న దానిపై నేతలు లోతుగా అధ్యయనం చేయనున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో...
ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన కూడా బహిరంగంగా మద్దతు ఇవ్వకపోవడంపై కూడా సమావేశంలో చర్చించే అవకాశముంది. మరోవైపు విష్ణుకుమార్ రాజు లాంటి నేతలు టీడీపీ, జనసేనతో పొత్తు పెట్టుకోవాలని అందరూ ఆశిస్తున్నారనికామెంట్స్ చేస్తున్నారు. ఈ సమావేశానికి రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ పార్లమెంటు సభ్యులు కూడా హాజరు కావాలని ఇప్పటికే సమాచారం వెళ్లింది.
Next Story

