Fri Jan 30 2026 20:02:00 GMT+0000 (Coordinated Universal Time)
నేడు వైసీపీ ఆత్మీయ బీసీ సమావేశం
తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు బీసీల ఆత్మీయ సమావేశం జరగనుంది

తాడేపల్లి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు బీసీల ఆత్మీయ సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి నేతృత్వంలో ఈ సభ జరగనుంది. ఈ సభలో బీసీ సామాజికవర్గానికి చెందిన మంత్రులతో పాటు ఎమ్మెల్యేలు కూడా పాల్గొననున్నారు.
సంక్షేమ పథకాలతో పాటు...
వైసీపీ ప్రభుత్వం బీసీలకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు చేయాల్సిన ప్రయత్నాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీలకు ఆర్థికంగా, రాజకీయంగా ఎంత మేర ప్రయోజనం చేకూర్చిందన్న విషయంపై కూడా చర్చించి దానిని ఆ వర్గం ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న ప్రయత్నమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశ్యంగా తెలుస్తోంది. ఈ సమావేశంలో బీసీలకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొననున్నారు.
- Tags
- bcs meeting
- ysrcp
Next Story

