Thu Mar 19 2026 05:27:25 GMT+0530 (India Standard Time)
ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి మృతి
అల్లూరి సీతారామజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

అల్లూరి సీతారామజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఒడిశా నుంచి విజయవాడ వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఒక ప్రయివేటు బస్సులో ఒడిశా నుంచి కార్మికులను తరలిస్తున్నారు. చింతూరు అటవీ ప్రాంతంలో ప్రయివేటు బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది కార్మికులు ఉన్నారు.
డ్రైవర్ నిర్లక్ష్యమే...
ఈ ఘటనలో మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వారి పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులున్నారని తెలిపారు. క్షతగాత్రులను స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానాకి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

