Sun Mar 15 2026 19:20:18 GMT+0530 (India Standard Time)
కడప జిల్లాలో చిరుత మృతి
కడప జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక చిరుత పులి మృతి చెందింది.

కడప జిల్లాలో గుర్తుతెలియని వాహనం ఢీకొని ఒక చిరుత పులి మృతి చెందింది. రోడ్డు దాటుతుండగా వాహనం ఢీకొట్టడం వల్లనే పులి మృతి చెందింది. కడప జిల్లా గువ్వల చెరువు ప్రధాన రహదారిపై ఈ ఘటన చోటు చేసుకుంది. చిరుత పులి మంచినీరును తాగేందుకు పక్కనే ఉన్న చెరువుకు వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది.
వాహనం ఢీకొని....
చిరుతపులి మృతి వార్త తెలిసిన వెంటనే అటవీ శాఖ అధికారులు దీనిపై విచారణ చేపట్టారు. ఈ ప్రాంతంలో చిరుత సంచారం వార్త విని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
Next Story

