Fri Dec 05 2025 15:54:42 GMT+0000 (Coordinated Universal Time)
మత్య్సకారుడిని లాక్కెళ్లిన భారీ చేప
సముద్రంలో చేపలవేటకు వెళ్లిన యువకుడిని భారీ చేప లాక్కెళ్ళింది.

సముద్రంలో చేపలవేటకు వెళ్లిన యువకుడిని భారీ చేప లాక్కెళ్ళింది. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం పూడిమడకకు చెందిన చోడపల్లి యర్రయ్య, అతడి తమ్ముడు కొర్లయ్య, వాసుపల్లి యల్లాజి, గనగళ్ల అప్పలరాజులు సముద్రంలో చేపలవేటకు వెళ్లారు. తీరానికి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉండగా గేలానికి సుమారు 100 కిలోల బరువుండే కొమ్ముకోనాం చేప చిక్కింది. దాన్ని యర్రయ్య తాడుతో బోటులోకి లాగే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో చేప యర్రయ్యను బలంగా నీటి లోపలికి లాక్కెళ్లిపోయింది. యర్రయ్య గల్లంతు అయిపోయాడు. కొర్లయ్య గ్రామస్థులకు సమాచారం అందించగా, పడవల్లో కొన్ని గంటల పాటూ గాలించినా యువకుడి ఆచూకీ తెలియరాలేదు. దీంతో పూడిమడక గ్రామంలో విషాదం నెలకొంది.
Next Story

