Sun Mar 15 2026 21:35:30 GMT+0530 (India Standard Time)
రుషికొండపై రాజు పిటీషన్ స్వీకరణ
రుషికొండలో పర్యావరణ ఉల్లంఘనలపై హైకోర్టులో విచారణ జరిగింది.

రుషికొండలో పర్యావరణ ఉల్లంఘనలపై హైకోర్టులో విచారణ జరిగింది. రుషికొండ కేసులో తనను ఇంప్లీడ్ చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు వేసిన పిటీషన్ ను హైకోర్టు విచారణకు అనుమతి ఇచ్చింది. దీనిపై ఇప్పటికే రెండు ప్రజాప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి. సుప్రీంకోర్టు సూచన మేరకు తన పిటీషన్ ను కూడా అనుమతించాలని రఘురామ కృష్ణరాజు కోరారు. దీనిపై విచారించిన హైకోర్టు ఆయన పిటీషన్ పై విచారించేందుకు అనుమతిచ్చింది.
ఈ నెల 27వ తేదీకి...
రుషికొండ లో పర్యావరణ ఉల్లంఘనలు జరుగుతున్నాయని రఘురామ కృష్ణరాజు ఆరోపిస్తున్నారు. కొండను తవ్వి ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆయన పిటీషన్ లో పేర్కొన్నారు. గతంలో రుషికొండ తవ్వకాలపై హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన స్టే ఆర్డర్ ను కూడా పొందుపర్చారు. దీనిపై ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. దీనిపై విచారణను ఈ నెల 27వ తేదీకి వాయిదా వేసింది.
Next Story

