Sun Feb 01 2026 07:06:12 GMT+0000 (Coordinated Universal Time)
బాబుకు మద్దతుగా ఉద్యోగానికి రాజీనామా
చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో దూషించినందుకు నిరసనగా ఒక హెడ్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

చంద్రబాబు కుటుంబాన్ని అసెంబ్లీలో దూషించినందుకు నిరసనగా ఒక హెడ్ కానిస్టేబుల్ తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన ఈ హెడ్ కానిస్టేబుల్ తాను రాజీనామ చేస్తున్నట్లు వీడియోను విడుదల చేశారు. ఇది నెట్టింట వైరల్ అయింది. చంద్రబాబుతో పాటు ఆయన కుటుంబ సభ్యులను దూషించినందుకు నిరసనగా హెడ్ కానిస్టేబుల్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
ప్రకాశం జిల్లాకు చెందిన...
1998 బ్యాచ్ కు చెందిన తాను ప్రకాశం జిల్లాలోనే టాపర్ గా నిలిచానని చెప్పారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగంలో చేరానని, నిజాయితీ, నిబద్దతతో పనిచేశానని ఆయన తన వీడియోలో పేర్కొన్నారు. నిన్న అసెంబ్లీలో జరిగిన ఘటన చూసిన తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నానని ఆయన చెప్పారు.
Next Story

