Thu Mar 19 2026 08:54:22 GMT+0530 (India Standard Time)
పట్టాలు తప్పిన రైలు - రైళ్లన్నీ ఆలస్యం
పిఠాపురం - సామర్లకోట స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ రూట్లో రైళ్లన్నీ ఆలస్యంగా నడుస్తున్నాయి

పిఠాపురం - సామర్లకోట స్టేషన్ల మధ్య గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దీంతో పిఠాపురంలోనే యశ్వంతపూర్, రత్నాచల్ ఎక్స్ప్రెస్ రైళ్లు నిలిచిపోయాయి. దీంతో విజయవాడ - విశాఖల మధ్య రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. అనేక రైళ్లు ఆలస్యంగా నడుస్తుండటంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
గోదావరి ఎక్స్ప్రెస్...
విశాఖపట్నం స్టేషన్ లోనే ఇంకా గోదావరి ఎక్స్ప్రెస్ నిలిచిపోయి ఉంది. గోదావరి రైలు ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సింగిల్ లైన్ మీదుగానే అధికారులు రైళ్ల రాకపోకలను అనుమతించారు. వెంటనే సహాయక చర్యలను రైల్వే శాఖ ప్రారంభించింది.
Next Story

