Tue Mar 17 2026 12:52:30 GMT+0530 (India Standard Time)
చేపపై విశాఖ పోలీసులు కేసు నమోదు
చేపల వేటలోవేటకు వెళ్లిన మత్స్యకారుడు పై చేప దాడి చేయడంతో ఇటీవల విశాఖ తీరంలో మృతి చెందాడు.

చేపల వేటలోవేటకు వెళ్లిన మత్స్యకారుడు పై చేప దాడి చేయడంతో ఇటీవల విశాఖ తీరంలో మృతి చెందాడు. ముత్యాలమ్మ పాలెంకు చెందిన ఐదుగురు మత్స్య కారులు చేపల వేటకు వెళ్లారు. మత్స్యకారులు వలను బయటకు తీసే సమయంలో జోగన్న అనే మత్స్యాకారుడిని చేప తన కొమ్ముతో పొడించింది. దీంతో జోగన్న అక్కడికక్కడే మృతి చెందాడు.
దాడిచేయడంతో....
వల బయటకు లాగేందుకు ప్రయత్నిస్తే సాధ్యం కాక పోవడంతో మత్స్య కారుడు జోగన్న పడవ దిగి వలను తీయాలని ప్రయత్నించారు. ఈ సమయంలోనే పెద్ద చేప జోగన్న పై దాడికి దిగింది. చేప తన కొమ్ముతో జోగన్న పై దాడి చేయడంతో మరణించాడు. అందిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story

