Thu Mar 19 2026 10:28:13 GMT+0530 (India Standard Time)
Vijayawada : బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం
విజయవాడ బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో మంటలు చెలరేగాయి.

విజయవాడ బీసెంట్ రోడ్డులో అగ్ని ప్రమాదం సంభవించింది. నాల్గవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. బీసెంట్ రోడ్డులోని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ లో రెండు ఫ్లోర్ లలో రెండు కోర్టులు పనిచేస్తున్నాయి. అదే కాంప్లెక్స్ లో బ్యాంక్ తో పాటు మరికొన్ని కార్యాలయాలు కూడా ఉన్నాయి.
అదుపులోకి.....
ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తమయి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
Next Story

