Mon Mar 16 2026 22:37:26 GMT+0530 (India Standard Time)
నేడు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో
నేడు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో తుది విచారణ జరగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై 77 పిటీషన్లు దాఖలయ్యాయి

నేడు మూడు రాజధానుల అంశంపై హైకోర్టులో తుది విచారణ జరగనుంది. మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దుపై హైకోర్టులో 77 పిటీషన్లు దాఖలయ్యాయి. వీటిపై విచారణకు వచ్చే సమయంలో ప్రభుత్వం మూడు రాజధానుల బిల్లును, సీఆర్డీఏ రద్దు బిల్లును వెనక్కు తీసుకుంది. ఈ విషయాన్ని ప్రభుత్వం హైకోర్టుకు తెలియజేసింది.
కొనసాగించాలని....
అయితే పిటీషనర్లు మాత్రం ఈ బిల్లుల్లో మార్పులు చేసి తెస్తామని ముఖ్యమంత్రి చెప్పినట్లు కోర్టుకు నివేదించారు. విచారణను కొనసాగించాలని పిటీషనర్లు కోరారు. ఏఏ అంశాలపై విచారణ చేయాలో అఫడవిట్ దాఖలు చేయాలని హైకోర్టు పిటీషనర్లకు సూచించింది. దీంతో నేడు హైకోర్టులో దీనిపై విచారణ జరగనుంది.
Next Story

